James Cameron: డిసెంబరులో 'అవతార్' పార్ట్ 3 విడుదల 6 d ago

మొత్తం సినీ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం 'అవతార్' ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దీనికి తదనంతరంగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సిద్ధమవుతోంది. తొలి రెండు చిత్రాలతో పోలిస్తే పార్ట్ 3 ఎంతో ఆసక్తిగా ఉంటుందని చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెలిపారు. ప్రేక్షకులు ఈ కొత్త అధ్యాయాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని కామెరూన్ తెలిపారు. అవతార్: ఫైర్ అండ్ యాష్ డిసెంబరులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.